అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

చిత్రాసేన్

మంగళవారం, 14 అక్టోబరు 2025 (19:09 IST)
Director Jayashankar, Vinod Varma
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన అరి సినిమా జయశంకర్ దర్శకత్వంలో రూపొందింది. "అరి" సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షాకదరణతో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
 
నటుడు వినోద్ వర్మ మాట్లాడుతూ,  సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అరిషడ్వర్గాల నేపథ్యంలో జయశంకర్ సినిమా రూపొందించినప్పుడు ఇందులో ఏదో ఒక ఎమోషన్ ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందని నమ్మాను. మా నమ్మకాన్ని నిజం చేస్తూ ఆడియెన్స్ విజయాన్ని అందించారు. పేపర్ బాయ్ సినిమాలో అవకాశం ఇచ్చి నాకు గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు జయశంకర్...ఈ చిత్రంలో లీడ్ రోల్ ఇచ్చి మరింతగా పేరుతెచ్చుకునేలా చేశారు.
 
ఈ పాత్రలో నటిస్తున్నప్పుడు నా క్యారెక్టర్ కు న్యాయం చేస్తున్నానా లేదా అనేది మాత్రమే ఆలోచించాను. ఆ క్యారెక్టర్ ను బాగా ప్లే చేసేందుకు ప్రయత్నించాను. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జయశంకర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సక్సెస్ ఫుల్ గా సినిమాను మన ముందుకు తీసుకొచ్చాను. నటన పట్ల నా ప్యాషన్ ను గుర్తించి మా పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం వల్లే ఈ రోజు ఈ వేదిక మీద ఉండగలిగాను. "అరి" సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. అన్నారు.
 
దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ - "అరి" సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మంచి రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చిన మీడియా వారికి థ్యాంక్స్. మూవీకి స్లోగా ఓపెనింగ్స్ వచ్చి పికప్ అవుతుందని ముందే అనుకున్నాం. అయితే రెండో రోజునే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్ ను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధగా అనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. 
 
థర్డ్ డే నుంచి అరి సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి కనిపించింది. అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు గానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే అరి చిత్రాన్ని రూపొందించాను. నేను చూసిన సినిమాలు కొన్ని ఇలాంటి కాన్సెప్ట్ తో చిత్రాన్ని చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి. ఈ సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. మా సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీ డేట్ అనౌన్స్ చేస్తాం. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు