ఇందులో భాగంగా ఆటోలు, ట్యాక్సీలను కూడా ప్రయాణికుల సంఖ్యను కుదించి నడపనున్నారు. నాన్ కంటేన్మెంట్ జోన్లు ఉన్న జిల్లాల్లో ఈ బస్సు నడవనున్నాయి. అంతరాష్ట్ర బస్సు సర్వీసులను కూడా కేంద్రం పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రావెల్ పాసులు ఉన్నవారు మాత్రమే మరో రాష్ట్రానికి బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వచ్చేవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం వుండేలా బస్సుల సీటింగ్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది. అదేవిధంగా ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్, లిక్విడ్ హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచనున్నది.