అధికార పార్టీ అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అధికారులు, పోలీస్ వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదని స్పష్టం చేశారు. వసూళ్లకు పాల్పడే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని, అధికారులు కోర్టులను ఆశ్రయించడం అలవాటుగా మారిందన్నారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ ఏడీజీ కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సీజేల నేతృత్వంలో స్థాయీ సంఘం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ప్రస్తుతానికి స్థాయీ సంఘంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని వెల్లడించారు.