గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాని అదాని కంపెనీకి అమ్మడాన్ని ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైందని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో జతకట్టి ప్రైవేటు పాట పాడుతోందని ఆరోపించారు.
గంగవరం పోర్టులోని 10.4 శాతం వాటాని అదాని గ్రూపునకు రూ.644.78 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోందని, ఇది ఎంత మాత్రం ఏపీకి ఉపయుక్తం కాదని రామకృష్ణ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని, అంబానీలకు ఊడిగం చేయటంకాక దీనిని ఏమనాలని రామకృష్ణ ప్రశ్నించారు.