ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పి.ఆర్.సి. పెద్ద దుమారామే రేపుతోంది. ప్రబుత్వం ప్రకటించిన పిఆర్సీని రద్దు చేసి, పాతదే అమలు చేయాలని ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనితో అన్ని జిల్లాలలో కలక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టారు. అయితే, పి,ఆర్.సి. రిపోర్ట్ కమిటీతో చేసినది కాకుండా, సీఎస్. తన రిపోర్ట్ ప్రకారం హెచ్.ఆర్.ఎ. వంటివి బాగా తగ్గించేసి ఉద్యోగులకు అన్యాయం చేశారని రాజకీయ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సీఎస్ చదువుకున్న మూర్ఖుడంటూ సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారులు అచ్చోసిన ఆంబోతులు మాదిరి తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు.. సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులు... వారికి రావాల్సినవి మాత్రమే అడుగుతున్నారని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉంటామని నారాయణ స్పష్టం చేశారు.