ఇదే అంశంపై ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సరైన లెక్కలు పంపితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందనడం సరికాదని, ఏపీకి ప్రత్యేక హోదా బదులు ఎక్స్‌ట్రీమ్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (ఈఏపీ) కింద నిధులు ఇస్తుందని అన్నారు.
కాగా, పోలవరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షనేత జగన్‌తో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంతో ఏపీ సర్కారు స్పందించింది. పోలవరం లెక్కలన్నీ ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్టు ప్రకటించింది.