ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డయ్యూ డామన్ - దాద్రా నగర్ హవేలీలకు డామన్ను రాజధానిగా మోదీ సర్కార్ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియా ద్వారా తెలియజేసారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. రాజధానిని ఒక ప్రాంతం నుంచి మరో రెండు ప్రాంతాలకు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే నిర్ణయానికి కేబినేట్, అసెంబ్లీ ఆమోదం తెలిపినా.. మండలి మాత్రం ఆమోదించలేదన్న విషయం తెలిసిందే.