అప్పటి వరకు జైలులోనే దేవినేని ఉమ - కస్టడీకి కోరిన పోలీసులు

శుక్రవారం, 30 జులై 2021 (15:40 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఉమపై జి.కొండూరు పోలీసు స్టేషన్‌లో అక్రమ కేసులు నమోదయ్యాయని ఉమ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదలను విన్న తర్వాత తదుపరి విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
 
మరోవైపు దేవినేని ఉమను తమ కస్టడీకి ఇవ్వాలని జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం దేవినేని ఉమ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై హత్యాహత్నం, కుట్రతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్సీ, ఎస్టీ వేధింపులకు సంబంధించి కోర్టులో డీఎస్పీ పిటిషన్ వేశారు. మంగళవారం దేవినేని ఉమను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 
 
హైకోర్టుకు వచ్చిన దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. ఈలోపు దేవినేని ఉమ నుంచి.. మరిన్ని వివరాలు రాబట్టాలని కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు