ఆసరా సేవలను జాతీయ స్థాయిలో ఇప్పటికే విస్తరించామని, త్వరలో లీగల్ అవేర్నెస్ మొబైల్ వ్యానులను కూడా ప్రారంభిస్తున్నట్లు ఆసరా కృష్ణా జిల్లా అధ్యక్షుడు, అమరావతి బోటింగ్ క్లబ్ సి.ఇ.ఓ. తరుణ్ కాకాని డీజీపీకి తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరంగా తాము చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించడంతోపాటు, వారి నుంచి వచ్చే ఫిర్యాదులను సంబంధిత ఫోరమ్ లో దాఖలు చేయడం కూడా ఆసరా పని అని తరుణ్ కాకాని పేర్కొన్నారు. వివిధ జిల్లాలలో సహాయం కోరే వినియోగదారులను గుర్తించి వారిక ఆసరా కల్పిస్తామన్నారు.
తమ సంస్థ చేపట్టే అవగాహన కార్యక్రమాలకు డీజీపీ తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని, త్వరలో డీజీపీ చేతుల మీదుగా లీగల్ అవేర్ నెస్ మొబైల్ వ్యాన్లను ప్రారంభించనున్నామని తరుణ్ కాకాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజిస్ట్రేట్ మాధవరావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మధు కోనేరు, కృష్ణా ఇసి ప్రకాశ్, ఆసరా మహిళా అధ్యక్షురాలు శిరీషా చేకూరి, కరంకౌర్ తదితరులు పాల్గొన్నారు.