పిసికెడు గడ్డి వేస్తే పశువులు.. బిస్కెట్ వేస్తే కుక్క విశ్వాసంగా ఉంటాయి..

శనివారం, 23 నవంబరు 2019 (20:11 IST)
నవ్యాంధ్ర రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను పశువులు, కుక్కలతో పోల్చారు. పైగా, పశువులు, కుక్కలు విశ్వాసంగా ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. మరి ఎన్నో మంచి పనులు చేసే ముఖ్యమంత్రి జగన్ పట్ల కృతజ్ఞతగా ఉండాలా వద్దా అంటూ నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 'మెగా జాబ్‌ మేళా'ను ఏర్పాటు చేశారు. దీన్ని అదే జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తూ, పిసికెడు గడ్డి వేస్తే పశువులు... బిస్కెట్ వేస్తే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుందన్నారు. కానీ సీఎం జగన్ ఇన్ని మంచి పనులు చేస్తున్నా... చప్పట్లు కొట్టడం లేదంటూ వాపోయారు. 
 
ఒక నిజాయితీ పరుడికి ఏం కావాలి? మీ హర్షధ్వనాలు, మీ చప్పట్లే కదా? అని అడిగారు. వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఇన్ని చేసిన ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞతగా ఉండాలా? వద్దా? అని నిరుద్యోగులను మంత్రి ప్రశ్నించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై నిరుద్యోగులు విస్తుపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు