సుప్రీంకోర్టు మందలింపుతో నిద్రమత్తువీడిన ఈసీ.. యోగిపై చర్య

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (16:25 IST)
సుప్రీంకోర్టు మందలింపుతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిద్రమత్తును వీడారు. తమ ఎన్నికల ప్రచారంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నా ఈసీ మాత్రం కఠిన చర్యలు తీసుకోలేకపోతోందని, అందువల్ల మంగళవారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పైగా, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహించలేక పోతోందంటూ మండిపడింది. 
 
దీంతో ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీల నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చర్యలకు ఆదేశించింది. యూపీ సీఎం యోగి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఈసీ భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా యోగి ఆదిత్యనాథ్‌పై మూడు రోజులు, మాయావతిపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. యోగి 72 గంటల పాటు, మాయావతి  48 గంటల పాటు ప్రచారం నిర్వహించకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు