అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందలనేది సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. ప్రాంతీయ వాదాలు రాకూడదనే అన్ని ప్రాంతాలు అభువృద్ధి కోసం సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. నిపుణుల కమిటీ నివేదికపై సీఎం జగన్తో చర్చిస్తామని సుచరిత పేర్కొన్నారు. రైతుల వద్ద తీసుకున్న భూములు ఉన్న ప్రాంతాలో కూడా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విశాఖ వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీమని ప్రశంసించారు. అగ్నిమాపక, పోలిసు ఉద్యోగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తామని ఆయన అన్నారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు ప్రాణాలు కాపాడటంలో ముందుండే ఫైర్ సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు. హూద్హూద్లో ఫైర్ సిబ్బంది అందించిన సేవలు మర్చిపోలేమని ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.