'రచ్చబండ'కు అక్రమ సంబంధం... రోజా సమక్షంలో చర్చ...

శనివారం, 17 జూన్ 2017 (19:26 IST)
అక్రమ సంబంధాలపై పోలీసు స్టేషనులో కేసులు పెట్టుకోవడం మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడవి రచ్చబండకు వచ్చేస్తున్నాయ్. తాజాగా వైసీపి ఎమ్మెల్యే రోజా ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహిస్తున్న రచ్చబండలో అక్రమ సంబంధం తాలూకు వ్యవహారంపై చర్చ చేపట్టారు. 
 
విజయనగరం లక్ష్మి కన్నీటి కథ... అంటూ మొదలెట్టేశారు. ఈ లక్ష్మితో ఆమె బావ రమణ వివాహం జరిగిందనీ, 15 ఏళ్లపాటు కాపురం సజావుగా సాగిన తర్వాత ఐదేళ్ల క్రితం వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు చెపుతోంది. అది తప్పంటే దౌర్జన్యం చేస్తున్నాడనీ, తన భర్తను మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా చూశానని ఆమె అంటోంది. దీనిపై రోజా చర్చను చేపట్టారు. బాధితురాలికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగరాదని రచ్చబండ కోరుకుంటోంది.

వెబ్దునియా పై చదవండి