కోవిడ్ నిబంధనలు వైసీపీవారికి వర్తించవా?: సయ్యద్ రఫీ

బుధవారం, 23 జూన్ 2021 (23:03 IST)
రాష్ట్రంలో పక్షపాతధోరణితో పాలనసాగుతోందని, మంత్రి సీదిరి అప్పలరాజు, వైసీపీఎమ్మెల్సీ తోటత్రిమూర్తులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, బీభత్సంగా సభలు, సమావేశా లు, ఊరేగింపులు నిర్వహించారని, వారిపై పోలీసులు ఎందుకు కేసులుపెట్టలేదని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. బుధవారం ఆయన జూమ్ ద్వారా తననివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. 
 
ఆ వివరాలు ఆయన మాటల్లోనేక్లుప్తంగా మీకోసం...! రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు ఉన్నాయా లేక పూర్తిగా ఎత్తేశా రా అనేఅనుమానం కలుగుతోంది. కర్ఫ్యూ ఉదయం 6నుం చి సాయంత్రం వరకు పెట్టుకోవచ్చని, సభలు సమావేశాలు ఎలాగైనా నిర్వహించవచ్చని ప్రకటనచేస్తారా లేదా.. మంత్రి అప్పలరాజుపై, ఎమ్మెల్సీ త్రిమూర్తులుపై కేసులుపెడతారో పెట్టరో సమాధానంచెప్పాలి. దీనిపై టీడీపీమహిళా నేత గౌతు శిరీష ఇప్పటికే పలాసపోలీసులకు ఫిర్యాదుచేశారు.

పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్యకూడా దీనిపై  ఫిర్యాదు చేశారు. ఎవరూతమకు మంత్రిపై, ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేయలేదని పోలీసులు తప్పించుకోవడానికికూడా లేదు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అందరికీ ఒక్కటేనని పోలీసులు నిరూపించాలి. గతంలో కూడా ఇదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సభలు, సమావేశాలకు అనుమతు లివ్వడం, షాపింగ్ మా ల్స్, సినిమాహాళ్లు తెరవడంవల్ల రాష్ట్రంలో రెండోదశ కరోనా విజృంభించింది.

మరలా ఇప్పుడుకూడా అలానేచేసి, ప్రజలను ఇబ్బందిపెడతారా? మంత్రులు, ఎమ్మెల్సీలు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న చర్యలు పోలీసులకు కనిపించడంలేదా? రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పాటిస్తున్నామని పోలీసులు హైకోర్టుకి చెప్పారు. మరి ఇప్పుడు అదిఏమైంది? తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీనేత ఒకాయన తనపుట్టిన రోజువేడుకలను రోడ్డుపై, పోలీస్ స్టేషన్ ఎదుటే జరుపుకున్నాడు.

ఆయన అనుచరులు ఆరోజు తల్వార్లు,కత్తులతో రోడ్లపై వీరంగం కూడా వేశారు. అలాంటివేవీ పోలీసులకు కనిపిస్తున్నట్లుగా లేవు. కోవిడ్ నిబంధనలు వర్తించడంలేదంటూ పోలీసులు చాలాచోట్ల టీడీపీనేతలు, కార్యకర్తలపైనే కేసులుపెట్టారు. ఎన్ 440-కే వైరస్ పై ప్రజలను అప్రమత్తం చేసిన చంద్రబాబు గారికి, ప్రజలను రెచ్చగొట్టాలనిచూశాడని  నోటీసులివ్వాలని చూశారు.

ఏపీ పోలీసులను హైదరాబాద్ వరకు కూడా పంపారు. అలాంటి వ్యాఖ్యలే మంత్రి సీదిరి అప్పలరాజుచేశాడని టీడీపీ బయటపెట్టడంతో, ఎందుకో చంద్రబాబుకి నోటీసులివ్వకుండా వెనుతిరిగారు. సీదిరి అప్ప లరాజుపై ఫిర్యాదుచేయడానికి వెళ్లిన టీడీపీనేతలపైనే గుంటూరులో ఎదురుకేసులుపెట్టారు. వైసీపీనేతలు ఏంచేసి నా చెల్లుతుందా?

వైసీపీవారికిరాష్ట్రంలో సొంత రాజ్యాంగం ఉందా? మిగిలినవారికే అంబేద్కర్ రాజ్యాంగంవర్తిస్తుందా? పోలీస్ శాఖ అధికారపార్టీ వారిని చూసీచూడనట్టు వదిలేయ డం వల్లే వారురెచ్చిపోతున్నారు. ప్రతిచోటా ఇప్పుడు కాకుం టే ఇంకెప్పుడన్న పద్ధతిలో చెలరేగిపోతున్నారు. సీదిరి అప్పలరాజు పలాసలో భారీసభనిర్వహించిన విషయం డీజీ పీకి తెలియదా?

గతంలో అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసులుపెట్టి, ఆపరేషన్ చేయించుకున్నాడనికూడా చూడ కుండా శ్రీకాకుళం నుంచి విజయవాడకు, గుంటూరుకు  తరలించారు. ఆసమయంలో అయన్ని  పలకరించడానికి వెళ్లిన టీడీపీనేతలపై కూడా కేసులుపెట్టారు.  పది,ఇంటర్ పరీక్షలురద్దుచేయాలంటూ టీడీపీ యువనేత నారాలోకేశ్ ప్రభుత్వంపై పోరాటంచేస్తున్నారు.

ఆయన మొన్నేదో కర్నూల్లో మాట్లాడినదాన్ని పట్టుకొని ఎప్పుడో సంవత్సరం క్రితం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ మరోకొత్తకేసు బయటకు తీశారు. ఇలా అనేక అంశాల్లో కోవిడ్ నిబంధనలు టీడీపీవారికే ఎందుకువర్తిస్తున్నాయి.

వైసీపీ వారికి ఎందు కు వర్తించడంలేదు? వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యే లు ఎన్నిచోట్ల ఎప్పుడెప్పుడు సభలు, సమావేశాలు నిర్వహించారో, వాటికి ఎందరు హాజరయ్యారో.. కోవిడ్ నిబంధనలు ఎలాఉల్లంఘించారో,  ఆధారాలతోసహా పోలీసులకు ఇస్తాము. వారు వాటిపై స్పందించి, తక్షణమే అధికారపార్టీవారిని అరెస్ట్ చేయగలరా? చంద్రబాబు నాయుడు, లోకేశ్ సహా, ఇతర టీడీపీనేతలపై కేసులు పెట్టడానికి మాత్రం ఒంటికాలిపై వస్తారు.

అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ నిబం ధనలను తూనాబొడ్డు అనిఖాతరుచేయకపోయినా పట్టించు కోరా? వారి చర్యలు, సభలు, సమావేశాలు డీజీపీకి కనిపిం చడంలేదా? లేకపోతే తనపార్టీవారు ఏంచేసినా పట్టించుకోవ ద్దని ముఖ్యమంత్రి ఏమైనా డీజీపీతోచెప్పాడా? శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మదుసూధన్ రెడ్డి, తొలిదశ, రెండోదశ కరోనాసమయాల్లో ఎలాప్రవర్తించాడో ప్రజలందరూ చూశారు.

ఆయనపై ఎందుకుకోవిడ్ నిబంధనలు అతిక్రమించారని కేసులు నమోదుచేయలేదు? టీడీపీవారు ఏంచేసినా తప్పనే పోలీసులు, వైసీపీవారికి మాత్రం ఎందుకు మినహా యింపులిస్తున్నారో డీజీపీ సమాధానంచెప్పాలి.

సోషల్ మీడియాలో పోస్టలుపెట్టినా, ప్రభుత్వతీరుపై ప్రశ్నించినా పోలీసులు వెంటనే టీడీపీవారిని అరెస్ట్ చేస్తారు. వైసీపీ వారు హైకోర్టుని, న్యాయమూర్తులను దూషించినా, వారిని అరెస్ట్ చేయాలని న్యాయస్థానాలు చెప్పినా ఇంతవరకు ఆ పని చేయలేదు.  రాజ్యాంగాన్ని కూడా పక్కనపెట్టి, వైసీపీ వారికి ఒకచట్టం, ఇతరులకు మరోచట్టాన్ని అమలుచేయడం డీజీపీ కి న్యాయమా?

మాజీమంత్రి కొల్లురవీంద్రపై పెట్టిన కేసులనే మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ త్రిమూర్తులుపై పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పాటిస్తామని హైకోర్టుకు చెప్పిన డీజీపీ, దానికి కట్టుబడి తక్షణమే అధికా రపార్టీవారిపై చర్యలు తీసుకోవాలి.

లేకుంటే ఆయన ప్రతిపక్ష నేతలు, కార్యకర్తల విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తు న్నారనే అనుకోవాల్సి ఉంటుంది. పోలీస్ శాఖ వెంటనే స్పందించి, అప్పలరాజు, త్రిమూర్తులుపై కేసులునమోదు  చేయాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాము.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు