నాకు కరోనా లేదు మహాప్రభో : డాలర్ శేషాద్రి

సోమవారం, 20 జులై 2020 (20:34 IST)
తనకు కరోనా వైరస్ సోకినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థాన్ ఓఎస్డీ డాలర్ శేషాద్రి స్పందించారు. తనకు ఎలాంటి కరోనా వైరస్ వైరస్ సోకలేదని స్పష్టం చేశాడు.
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు కరోనా సోకినట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. పైగా, తనపై దుష్ప్రచారం చేసిన ఎస్వీబద్రీపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరినట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి పోలీసులు బద్రీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, డాలర్ శేషాద్రి కూడా తన వివరణ ఇచ్చారు. అలాగే, ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిపే వైద్య పరీక్షల్లో భాగంగా, చెన్నై ఆస్పత్రిలో వైద్య పరీక్షలును డాలర్ శేషాద్రి చేయించుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు