విజయవాడ ఏలూరు రోడ్డులోని విశాలాంధ్ర బుక్ హౌస్‌ను సందర్శించిన జనసేనాని కార్ల్ మార్క్స్, ఫౌంటెన్ హెడ్ సహా పలు పుస్తకాలు కొనుగోలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాతృభాషను ఏపీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
6 వ శతాబ్దంలో ఏడూ వేల గ్రామాల మండలమైన రేనాడు – ఇప్పటి రాయలసీమలోనే తెలుగు లిపిలో ఉన్న మొట్టమొదటి శాసనాలన్నీ దొరికిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం అప్పటి రేనాడు గ్రామాలే నంటూ తాజాగా ఇప్పుడు రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రే తెలుగుకి ద్రోహం చేస్తున్నారంటూ విమర్శించారు.