నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో తిరుపతికి చెందిన చిన్నారి సింధూజ చేయి కలిపింది. తాను కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో తిరుపతి వేదికగా జరుగుతున్న మహానాడుకు చేరుకుంది. తనతో పాటు రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలన్న ఉద్దేశంతో తమకు తోచిన విధంగా సహకారం అందించాలంటూ హుండీతో అందరి దగ్గరికి వెళుతోంది. విరాళాలను సేకరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.