ఎన్టీఆర్‌కు మగతనం పెంచే స్టెరాయిడ్ ఇచ్చారు.. లక్ష్మీ పార్వతి వల్లే?: కుసుమ రావు

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (10:53 IST)
దివంగత సీఎం ఎన్టీఆర్‌కు భార్యగా లక్ష్మీ పార్వతి నిలవగలగడం ఎన్నో జన్మల పుణ్యం అని డాక్టర్ కుసుమ రావు తెలిపారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకంకు డాక్టర్ కుసుమ సన్నిహితురాలు. అంతేగాకుండా ఎన్టీఆర్ మరణం సహజమైంది కాదని.. కుసుమ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మగతనాన్ని పెంచే స్టెరాయిడ్స్‌ను ఎన్టీఆర్‌కు ఇచ్చారనే చర్చ మెడికల్ సర్కిల్స్‌లో జరుగుతోందని తెలిపారు. 
 
ఎన్టీఆర్ భౌతికకాయాన్ని తొలుత చూసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకరని కుసుమ రావు చెప్పారు. అంతేగాకుండా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిపై ఆమె విమర్శలు గుప్పించారు. అప్పటి ప్రభుత్వ కార్యకలాపాల్లో లక్ష్మీపార్వతి ఎక్కువగా జోక్యం చేసుకునేవారని తెలిపారు. లక్ష్మీపార్వతి సూచనతోనే చంద్రబాబును మంత్రి పదవి నుంచి, పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి ఎన్టీఆర్ తొలగించారని ఆరోపించారు.
 
ఇదిలా వుంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలంగాణలో విడుదలైంది. ఈ సినిమా ఏపీలో విడుదలకు నోచుకోలేదు. శ్రీతేజ్, విజ‌య్‌కుమార్‌, య‌జ్ఞాశెట్టి తదిత‌రులు న‌టించిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాకు వర్మతో పాటు అగ‌స్త్య మంజు ద‌ర్శ‌కులు. ఆర్.జి.వి ఫిలింస్ సమర్పణలో రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మార్చి 29న విడుదలైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు