పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

ఠాగూర్

సోమవారం, 25 ఆగస్టు 2025 (17:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ఓజీ" (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). సుజీత్ దర్శకత్వం. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, లిరికల్ సాంగ్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వచ్చే ప్రతి అప్డేడ్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుద చేస్తున్నట్టు ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే, ఆ పోస్టర్‌లోని ఒక చిన్న విషయం ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. 
 
ఈ పోస్టరులో పవన్ కళ్యాణ్ - ప్రియాంక అరుళ్ మోహన్‌లు రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. దీపాల వెలుగులో వారిద్దరూ ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు. అయితే, అభిమానులు దృష్టి మొత్తం పవన్ కుడి చేతిపై ఉన్న ఒక టాటూపై పడింది. జపనీస్ భాషలో మూడు అక్షరాలతో ఉన్న ఆ టాటూ అర్థం ఏమిటంటూ అందరూ ఆసక్తిగా వెతగడం ప్రారంభించారు. 
 
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఆ మూడు జపనీస్ అక్షరాలకు శక్తివంతమైన అర్థాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో మొదటి అక్షరానికి ప్రామిస్ (వాగ్ధానం), రెండో అక్షరానికి స్ట్రెంగ్త్ (బలం), మూడో అక్షరానికి ఫైర్ (నిప్పు) అని అర్థం వస్తుందని అంటున్నారు. ఈ మూడు పదాలు సినిమాలో పవన్ పాత్ర స్వభాన్ని ఆయన లక్ష్యాన్ని ప్రతిబింభించేలా ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గ్లింప్స్‌, మొదటి పాటతో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఓజీపై ఈ టాటూ ఇపుడు మరింత ఆసక్తిని పెంచింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు