పార్టీ నుంచి సస్పెండ్ చేసినా బిల్లుపై తగ్గేది లేదు: డాక్టర్ కేవీపీ

బుధవారం, 27 జులై 2016 (14:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని తాను రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదనీ, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను సస్పెండ్ చేసినా ఏమాత్రం వెనుకంజవేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ... పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ప్రత్యేక హోదా బిల్లును ఉపసంహరించుకునేది లేదన్నారు. ప్రత్యేక హోదాపై రేపు రాజ్యసభలో 2 గంటల పాటు చర్చించాలని బీఏసీలో నిర్ణయించామన్నారు. చర్చలో ప్రభుత్వం తరపున ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పనున్నారని తెలిపారు. 
 
అయితే కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల వాదన మరోలా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా బిల్లును ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు. కానీ, బిల్లును ప్రవేశపెట్టిన కేవీపీ మాత్రం అలాంటిదేమీ లేదనీ, బిల్లుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి