కాగా, అంతకుముందు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి మాట్లాడుతూ తన కుమారుడిపై స్లో పాయిజన్ ప్రయోగం జరుగుతోందని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తమ కుమారుడిపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు హైకోర్టు ఆదేశాలతో కేసును విచారించిన సీబీఐ... పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఐపీసీ 120బి, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కావాలని దూషించడం, నేరపూరిత కుట్ర, దొంగతనం, బెదిరింపులకు పాల్పడటం, అక్రమ నిర్బంధం వంటి అభియోగాలను నమోదు చేశారు.