మోడ్రెన్ అమ్మాయిలం అంటూ కొందరు అమ్మాయిలు తెలంగాణ రాజధాని హైదరాబాదులో నానా రచ్చ చేస్తున్నారు. వీరు పబ్బుల్లో, పార్టీల్లో హాజరయ్యాక అలా పచ్చటి లాన్లోకి వచ్చేసి సిగరెట్ తీసి దమ్ము కొడుతూ సరదాగా మాట్లాడుతున్నారు. మరికొందరైతే రాత్రివేళ పూటుగా మద్యం సేవించి రోడ్లపై నానా రచ్చ చేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి హైదరాబాదులో ఓ అమ్మాయి పీకలదాకా తాగి ఫిలిం నగర్ నుంచి కృష్ణా నగర్ వరకూ ఆటోలో వచ్చింది.
ఆటో ఆపి తూలుకుంటూ వెళ్లిపోతుంటే, ఆటోవాలా డబ్బులడిగాడు. ఇంకేముందు... ష(న)న్నే ష(డ)బ్బులడుగాతావ్ రా అంటూ అతడిపై దాడి చేయబోయింది. దీంతో అతడు బెదిరిపోయి రోడ్డు పక్కకు పరుగుపెట్టాడు. ఇంతలో అక్కడ స్థానికులు గుమిగూడారు. అతడిపైకి వెళుతుంటే అడ్డుకున్నారు. వారు అడ్డు రావడంపై మండిపడిన సదరు యువతి వారిని కూడా బూతులు తిట్టడం మొదలుపెట్టింది. ఇంతలో ఆటో డ్రైవర్ తిన్నగా వెళ్లి బంజారా హిల్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గతంలో కూడా ఇలాగే తాగి నానా హంగామా చేసినట్లు పోలీసులు చెప్పడం గమనార్హం.