Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

దేవీ

బుధవారం, 2 జులై 2025 (17:13 IST)
Dil Raju
నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న "తమ్ముడు" చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ నటించారు. "తమ్ముడు" సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.
 
- "తమ్ముడు" మూవీ మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్ గా ఉన్నాయని ఎ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఆ రెండు ఎపిసోడ్స్ తీసేస్తే యు బై ఎ ఇస్తామని చెప్పారు. ఈ సినిమాను థియేటర్ ఎక్సిపీరియన్స్ కోసమే చేశాం కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్సులు తీసేయకుండా ఎ సర్టిఫికెట్ కు అంగీకరించాం.
 
నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్ బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే, నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్ కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్ గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్ తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్ గా చూడొద్దు.
 
81 అప్లికేషన్స్ లో 7 గురిని ఫైనల్ చేశాం
- ప్రతిభ గల కొత్త వాళ్లకు అన్ని విభాగాల్లో అవకాశాలు ఇవ్వాలనే దిల్ రాజు డ్రీమ్స్ స్టార్ట్ చేశాం. మొదటి రోజునే మాకు 12 వేల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో స్క్రూటినీ చేసి 1400 అప్లికేషన్స్ తీసుకున్నాం. ప్రొడ్యూసర్ గా 81 అప్లికేషన్స్ వస్తే వాటిలో వాళ్ల కంపెనీ హిస్టరీ ఏంటి అని డీటెయిల్స్ చూసి 7 అప్లికేషన్స్ తీసుకున్నాం. ఇందులో రెండు మోడల్స్ చేస్తున్నాం. ఒకటి కథ బాగుంటే మేమే ఫండింగ్ చేసి వాళ్లతో మూవీ చేయిస్తాం. రెండోది వాళ్లే సినిమా చేసుకుని మా ప్రెజెన్స్, మా గైడెన్స్ లో రిలీజ్ చేస్తాం. ఈ క్రమంలో కొత్త నిర్మాతలు కూడా ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తున్నాం.
 
కొత్త చిత్రాల వివరాలు
- ఎఫ్ డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆన్ లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మా సంస్థలో రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కు తీసుకొస్తాం.

వచ్చే ఏడాదిలో చేయాల్సిన ఐదారు మూవీస్ స్క్రిప్ట్ నెరేషన్ స్టేజ్ లో ఉన్నాయి. అవి 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎస్వీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో రాబోతున్న కొత్త మూవీస్. నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒకటి, మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్ తో ఒక సినిమా ఉంటాయి. అలాగే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు లాక్ చేశాం.

యానిమల్ తో ఒక సినిమా ఉంటుంది. అందులో నటించే స్టార్ హీరో కోసం చూస్తున్నాం. ఇవి కాకుండా దిల్ రాజు డ్రీమ్స్ లో రెండు మూడు చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. ఎలాంటి కంటెంట్ తో సినిమాలు తీస్తే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారు అనేది డిస్కస్ చేస్తున్నాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు