వివాహితతో డిఎస్పీ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన భర్త..?

సోమవారం, 26 నవంబరు 2018 (09:59 IST)
తిరుపతిలో పోలీసు ఉన్నతాధికారి రాసలీలలు బయటపడ్డాయి. ఖాళీగా తిరుగుతున్న ఒక వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతని భార్యను లోబరుచుకున్నాడు. తన భార్య... పోలీసు ఉన్నతాధికారితో చనువుగా ఉండడాన్ని చూసిన భర్త వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాడు. చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన ప్రసాద్‌కు, ధనలక్ష్మికి 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. 
 
ఉద్యోగం కోసం వీరి కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లింది. బంధువుల సహాయంతో డిఎస్పీ దుర్గాప్రసాద్‌ను ఉద్యోగం కోసం కలిశాడు ప్రసాద్. తన భార్య ధనలక్ష్మిని వెంట పెట్టుకుని డిఎస్పీ దగ్గరకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళినప్పుడు ధనలక్ష్మితో డిఎస్పీ పరిచయం పెట్టుకున్నాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తిరుపతిలోని టిటిడి ఫారెస్ట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో తిరుపతికి కుటుంబాన్ని షిప్ట్ చేశాడు ప్రసాద్. 
 
అయితే డిఎస్పీ దుర్గాప్రసాద్ మాత్రం ధనలక్ష్మితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ప్రసాద్ ఇంట్లో లేని సమయంలో ఇంటికి రావడంతో ప్రసాద్‌కు అనుమానం వచ్చింది. మధ్యాహ్నం రెడ్ హ్యాండెండ్‌గా దుర్గాప్రసాద్, ధనలక్ష్మి కలిసి ఉన్నప్పుడు పోలీసులకు సమాచారమిచ్చారు. తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే డిఎస్పీ పరారయ్యాడు. ధనలక్ష్మిని తిరుచానూరు పోలీసులు విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు