సీఎం జగన్ నివాసం వద్ద డీఎస్సీ 2008 అభ్యర్థులు నిరసన

ఆదివారం, 7 జులై 2019 (12:23 IST)
తాడేపల్లి: భారీ స్థాయిలో సీఎం నివాసానికి చేరుకున్న డీఎస్సీ అభ్యర్థులు నిరసన చేపట్టారు. డీఎస్సీ 2008లో నష్టపోయిన 4657 మంది కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 
 
 
గత పది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నా సమస్య పరిష్కారం కాలేదని అభ్యర్థుల ఆందోళన చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. 
 
 
ఆర్థికశాఖలో నిలిచిపోయిన జీవోను విడుదల చేసి డిఎస్సీ 2008 అభ్యర్థులకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
దాదాపుగా వంద మందికి పైగా ఆందోళనలో డిఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు