ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు నీటిలో మునిగిపోయి పెను విషాదం నింపింది. అయితే, ఈ బోటును గత కొన్ని రోజులుగా వెలికితీయలేక పోయారు. ఈ నేపథ్యంలో ఈ బోటును వెలికితీసే పనులను ధర్మాడి సత్యం బృందానికి ఏపీ సర్కారు అప్పగించింది.
ఇంకొద్దిసేపట్లో బోటును ధర్మాడి సత్యం ఒడ్డుకు తీసుకురానున్నారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా సెప్టెంబర్ 15వ తేదీ కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు.