ఎల్.జి. పాలిమర్స్ స్టైరీన్ గ్యాస్ లీక్ బాధితులలో ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల దరకు పరిహరం పరిహరం అందుతుందని, ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు బాధిత గ్రామాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపిలు అధికారులు రాత్రి బస చేసినట్లు చెప్పారు. ఏ సమస్య లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక విభాగధిపతులచే, పరీక్షలు, వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. మంచి నీళ్లు ట్యాంకుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, కెజిహెచ్ పర్యవేక్షకులు డా.జి. అర్జున్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు.