అయితే, చిరంజీవిగారి పుట్టినరోజు ఆగస్టు 22 ఎప్పుడు వస్తుందా .. అని నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు చిరంజీవిని చూపని విధంగా నేను డిజైన్ చేసిన లుక్ విడుదలకాబోతుంది. అందుకు సినిమా యూనిట్ కూడా చాలా ఎగ్జైట్ మెంట్ తో వున్నారని చెప్పారు.
సినిమా షూటింగ్ గురించి చెబుతూ.. ఇప్పటికి ఇంటర్ వెల్ వరకు పూర్తయింది. సెకండాఫ్ మొదలు పెట్టాలి మధ్యలో అనుకోకుండా కార్మికుల సమ్మె రావడంతో షూటింగ్ వాయిదావేసుకోవాల్సి వచ్చింది. దీని ద్వారా నటీనటులు, టెక్నీషయిన్ల డేట్స్ వేస్ట్ అయ్యాయి. నిర్మాత బాగా నష్టపోయాడు అని చెప్పారు.
ఇదిలా వుండగా, చిరంజీవి 157 సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. నయనతార నాయికగా నటిస్తోంది.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. #Mega157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.