భారత ప్రధాన నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అజాన్ ఇచ్చేటప్పుడు మోదీ ఎన్నిసార్లు ప్రసంగాలు ఆపినా సైతాన్ ఆవహించిన హిందువుగానే మిగిలిపోతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మసీదులా కనిపిస్తున్న ఓ ప్రదేశంలో జన సమూహం ముందు భారత ప్రధానిపై అవాకులు పేల్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఓ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. సమీపంలో ఓ మసీదులో అజాన్ ఇచ్చారు.
ముస్లిం మనోభావాలను గౌరవిస్తూ.. కొద్దిసేపు తన ప్రసంగాన్ని ఆపి వేశారు. మోదీ ఇలా చేయడాన్ని ఉద్దేశిస్తూ అన్వర్ వివదాస్పద వ్యాఖ్యలు చేశాడు.