ఇకపోతే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సోనియా సోనియా సాంగ్‌తో నాగార్జున డ్యాన్స్ అదరగొట్టారు. ఇటీవల ఈ పాట తమిళంలో ట్రెండ్ అయ్యింది. నాగార్జున ఫస్ట్ హౌస్‌లోకి వెళ్లారు. కళ్లకు గంతలు కట్టుకుని లోపలికి వెళ్లి అంతా చూశారు.
వారిలో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ కింద.. తనూజ, ఆశాషైనీ, సంజనా గల్రానీ, ఇమ్మానుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, శ్రేష్ఠ వర్మ, భరణి శంకర్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన.. మాస్క్ మెన్ హరీష్, సోల్జర్ పవన్ కల్యాణ్, శ్రీజ దమ్ము, మర్యాద మనీష్, ప్రియా శెట్టి హౌస్‌లో అడుగుపెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రెటీలు కాగా.. మరో 6గురు సామాన్యుల్ని బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. ఇలా ఈ 15 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు 15 వారాలు బీభత్సం సృష్టించబోతున్నారు.