విశాఖపట్నానికి చెందిన కేవీ రామ్‌హర్షకు ఫేస్‌బుక్ నుంచి పిలుపు వచ్చింది. ఇందుకు అతడు ఇమూక్స్ రూపొందించడమే కారణం. వ్యాపారసంస్థల్లో డేటా మేనేజ్‌మెంట్ మరింత సులభమయ్యేలా సరికొత్త బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ ఆవిష్కృతమైంది. దీనికే ఇమూక్స్ అనే పేరు పెట్టారు. దీన్ని రామ్ హర్ష రూపొందించారు. రామ్ హర్ష.. ఈ ఏడాదే రాజాంలోని జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.
డేటా మేనేజ్‌మెంట్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధిపరచి ఇమూక్స్ అని దానికి పేరు పెట్టాడు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ తరహా ఉత్పత్తులకు ఇమూక్స్ భిన్నమైందని.. దీన్ని అందరూ ఉపయోగించుకోవచ్చునని తెలిపాడు. దీన్ని పరిశీలించిన ఫేస్ బుక్ సంస్థ తమ కార్యాలయానికి రావాల్సిందిగా పిలుపునిచ్చింది. ఇమూక్స్‌ను పరిశీలించిన ఫేస్‌బుక్ సంస్థ రామ్‌హర్షను కాలిఫోర్నియాలోని తమ కార్యాలయానికి ఆహ్వానించింది.