ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మృతి

ఆదివారం, 23 జనవరి 2022 (22:02 IST)
ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్యవేత్త రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. శ్వాస పీల్చడం ఇబ్బందిగా ఉండటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, ఆయన పూర్తిపేరు ములుగు రామలింగేశ్వర పరప్రసాద్. స్వస్థలం గుంటూరు. అయితే, హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా జ్యోతిష్యం, పంచాంగం చెబుతూ విశిష్ట గుర్తింపు పొందారు. పలు టీవీ చానెళ్ళలోనూ, పత్రికల్లోనూ ఆయన జ్యోతిష్యం, పంచాంగ విశేషాలను ఎంతో మంది అనుసరిస్తుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు