టాలీవుడ్ లో సంచలనం కలిగించిన డ్రగ్స్ కేసు మలి విడత విచారణ హంగామా హైదరాబాదులో మొదలైంది. డ్రగ్స్ కేసులో తొలి రో్జు విచారణకు ఈడీ కార్యాలయానికి సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరయ్యారు. ఈ రోజు మొత్తం పూరి జగన్నాథ్ ను ఇ.డి. అధికారులు విచారించనున్నారు. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్నట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ కేసులో ఇంకా చాలా మంది సినీ ప్రముఖులున్నారు. సినీ హీరోయిన్లు ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు తరుణ్, రవితేజ తదితర తారాగణాన్ని రోజుకు ఒకరిద్దరు చొప్పున పిలిపించుకుని ఇ.డి. విచారణ చేయనుంది.