మదనపల్లిలో అగ్నిప్రమాదం

సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:35 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లిలోని అప్పారావు వీధిలో ఉన్న అతిపెద్ద వ్యాపార సముదాయం ప్రదీప్‌ ట్రేడర్స్‌ భవనంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.

అగ్నిప్రమాదంతో రూ.కోట్లలో నష్టం ఉండొచ్చని పోలీసులు ప్రథమిక అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు