ఇప్పటికే రిలీజ్ చేసిన టన్నెల్ తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ చూస్తేనే చాలా గ్రిప్పింగ్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీగా ఉందని అర్థం అయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్‌గా ఉందని, మంచి మెసెజ్‌ను కూడా ఇచ్చేలా అద్భుతంగా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు.
లావణ్య త్రిపాఠి, అథర్వ కాంబో తమిళ్ ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు తెలుగులో అలరించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లకు అందరూ వావ్ అనాల్సిందే. జస్టిన్ ప్రభాకరన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. కలైవానన్ ఈ సినిమాకు ఎడిటర్. సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా తెలుగులో రిలీజ్ చేయనున్నారు.