పెద్దవడుగూరు మండలం కదరగుట్ట పల్లికి చెందిన ఓ మహిళపై 2014 మే నెలలో కిష్టపాడు గ్రామానికి చెందిన బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విజువల్స్ కూడా చిత్రీకరించారు.
ఆ చిత్రాలను కిష్టపాడుకు చెందిన నల్లబోతుల శివ కృష్ణమూర్తి, బోయ రామాంజినేయులలకు పంపి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈమేరకు... పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
ఏడుగురి నిందితుల్లో A-6, A- 7 లుగా ఉన్న నల్లబోతుల శివ కృష్ణమూర్తి, బోయ రామాంజినేయులులు అనారోగ్య కారణాలతో కేసు విచారణ సమయంలో చనిపోయారు.
ఈ కేసు సమగ్రంగా దర్యాప్తు చేసిన అప్పటి పామిడి సి.ఐ అశోక్ రెడ్డి, ఫిర్యాదు తరఫున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సృజన, కోర్టు కానిస్టేబుల్ ఎం.చంద్రశేఖర్ లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అభినందించారు.