మానవత్వం చాటుకున్న నూజివీడు పట్టణ పోలీస్ కానిస్టేబుల్

సోమవారం, 1 నవంబరు 2021 (10:03 IST)
ఉద‌యాన్నే పోలీసులు డ్యూటీకి వెళ్ళే హ‌డావుడిలో ఉంటారు. స్టేష‌న్లో మ‌స్ట‌ర్ వేయించుకుని, త‌మ త‌మ ప్రాంతాల్లో డ్యూటీకి హాజ‌ర‌వ్వాలి. లేక‌పోతే, అటెండెన్స్ ప‌డ‌దు. అదే హ‌డావుడిలో డ్యూటీకి వెళుతున్న కానిస్టేబుల్ త‌న‌లోని మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు. పోలీస్ ప్ర‌ధాన క‌ర్త‌వ్యం ప్ర‌జ‌ల్ని కాపాడ‌ట‌మే అని భావించాడు. అందుకే రోడ్డుపై ప‌డి ఉన్న ఓ యువ‌కుడిని ఆసుప‌త్రికి చేర్చి, ప్రాణాల్ని కాపాడాడు.
 
 
ఈ రోజు ఉదయం సుమారు 7:30 నిమిషాల‌ సమయంలో నూజివీడు పట్టణంలోని మైలవరం రోడ్డులో  ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి  మూర్ఛవచ్చి పడిపోయాడు. డ్యూటీకి అటుగా వెళుతున్న నూజివీడు  పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్  దిలీప్ కుమార్ (2726) త‌క్ష‌ణం స్పందించాడు. ఆ యువ‌కుడికి ప్రాథ‌మిక చికిత్స చేసి, స్థానికుల సహాయంతో అతనిని తక్షణం ప్రాణ ర‌క్ష‌ణ ప్ర‌య‌త్నం చేశాడు.


వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి, వైద్య సౌకర్యం కల్పించాడు. బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు వ‌చ్చి... ఆ యువ‌కుడి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ కి కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వ‌హ‌ణ అంటే, ప్ర‌జ‌ల్ని అదిలించ‌డం, బెదిరించ‌డం అనుకునే చాలా మంది పోలీసుల‌కు ఇది ఒక మంచి ప్రేర‌ణ క‌లిగించే ఉదంతం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు