అయ్యో, కృష్ణానదిలో సంధ్యా వందనం చేస్తూ ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి

శుక్రవారం, 10 డిశెంబరు 2021 (21:34 IST)
కృష్ణా నదీ తీరంలో దారుణం జరిగింది. ప్రతిరోజూ సంధ్యా వందనం చేయడానికి వెళ్లే విద్యార్థులు ఈ రోజు తిరిగి రాలేదు. కృష్ణా నదిలో మునిగి చనిపోయారు.

 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో ఓ వేద పాఠాశాల వుంది. ఇక్కడి వేద పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతిరోజూ కృష్ణా నదీ తీరంలో సంధ్యా వందనం చేస్తుంటారు. రోజు మాదిరిగానే శుక్రవారం సంధ్యా వందనం చేసేందుకు నదిలో దిగారు.

 
అంతే ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మునిగిపోయారు. వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడగా ఉపాధ్యాయుడితో సహా ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయి చనిపోయారు. ఈ ఆరుగురి మృతదేహాలను వెలికి తీసారు. వీరంతా ఉత్తరాది రాష్ట్రాల వారని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు