బాన్సువాడ, తాడ్కోల్ రోడ్డులోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే కె.గంగాధర్, ఉప సర్పంచ్‌తో సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.1.06 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్టు స్థానిక సీఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు.