మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై విద్యార్థుల దాడి

ఠాగూర్

ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (17:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు విద్యార్థులు మద్యం, గంజాయి సేవించి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు మద్యాన్ని సేవించి పాఠశాల మహిళా వంట మనిషిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి హైస్కూల్‌లో జరిగింది. ఈ నెల 13వ తేదీ రెండో శనివారం కావడంతో పాఠశాల మిద్దెపై కూర్చొని మద్యం సేవిస్తున్న తొమ్మది, పదో తరగతి విద్యార్థులను ఆమె గమనించి ప్రశ్నించింది. పైగా, వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. 
 
దీంతో భయపడిపోయిన విద్యార్థులంతా కలిసి వంట మనిషి కాసిమ్మపై భౌతికంగా దాడి చేసి ముఖ్యంపై దుప్పటి వేసి గొంతు నులిమేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాసిమ్మను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు