తిరుపతి వాసుల దశాబ్దాల కల త్వరలో నెరవేరనుంది. తిరుపతి బస్టాండు నుంచి అలిపిరి వరకు రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన మరో పది రోజుల్లో అందుబాటులోకిరానుంది. ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.648 కోట్లు. అయితే, నిధులను తితిదే దశల వారీగా విడుదల చేస్తుంది.
తితిదే, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్ గరుడ వారధి వారం, పది రోజుల్లో అందుబాటులోకి రానుంది. తొలి దశలో చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేశారు. మొత్తం ఆరు కిలోమీటర్ల మేరకు ఈ భారీ ఫ్లైవర్‌ను నిర్మిస్తున్నారు.
మూడేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చివరికి తొలి ఫేజ్ పూర్తి చేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ ఖర్చుతో తితిదే 67 శాతం నిధులు కేటాయించగా తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి33 శాతం కేటాయిస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో తితిదే కేవలం 75 కోట్ల రూపాయలను విడుదల చేసింది.