బాలికలపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో మేనమాన తన మేనకోడల్ని లైంగికంగా వేధించాడు. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ కాలనీకి చెందిన చిన్నారిపై అదే కాలనీకి చెందిన వరుసకు మేనమామ అయిన తెలగతోటి సుబ్బయ్య(29) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో 13 ఏళ్ల బాలుడు.. ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎల్‌బీనగర్‌లోని ఓ బస్తీకి చెందిన దంపతులు రోజుకూలీలు. వీరి కుమార్తె (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. కూలీ పనికి బాలిక తల్లిదండ్రులు వెళ్ళిపోవడంతో పాటు బోనాల సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది.