జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ చదువుకునే ఓ బాలిక గర్భందాల్చింది. ఈ గర్భానికి కారణం ఎవరో తెలియదు. కానీ, ఆ హస్టల్ విద్యార్థిని గర్భం దాల్చడంతో వసతిగృహ సిబ్బంది, అధికారులు గుట్టుచప్పుడుకాకుండా కాన్పు చేయించారు. కాన్పు తర్వాత పసిబిడ్డను హాస్టల్ కిటికీలోనుంచి బయటకు విసిరేసే సమయంలో అటుగా వెళ్ళిన వ్యక్తి ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. హస్టల్ సంక్షేమాధికారి విజయనిర్మలను సస్పెండ్ చేశారు. సాంఘిక సంక్షేమశాఖ జిల్లా సహయాధికారి శశిభూషణ్‌ను సస్పెండ్ చేయాలని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఆయన సిఫారసు చేశారు. హస్టల్ వాచ్‌ఉమెన్‌ను విధుల నుంచి తొలగించారు. అలాగే, బాలిక గర్భందాల్చిన వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.