వరుసకు సోదరి అయినప్పటికీ ఒక వివాహిత మహిళను కోరిక తీర్చమని ఓ కామాంధుడు వెంటబడిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. లావేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు వరుసకు సోదరి అయిన వివాహితను కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు.అతని వేధింపులను భరించలేక ఆమె పెద్దలకు చెప్పింది. అతనిని రచ్చబండకు పిలిపించి నిలదీశారు.
అప్పటికే అక్కడ కాపుకాసిన రమణ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలో పొలానికి వెళ్లిన బాబాయి వరుస అయ్యే వ్యక్తి రమణను పట్టుకుని రచ్చబండ వద్దకు తీసుకొచ్చి నిలదీశాడు. ఇదిలా ఉండగా, తనను వేధించిన వ్యక్తికి రాజకీయ పలుకుబడి ఉందని, ఆమె పోలీసులను ఆశ్రయించింది. రమణ వైపు వారు కూడా ఫిర్యాదు చేశారు.