టీడీపీ మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు... విందులో గోదావరి రుచులు...

బుధవారం, 17 మే 2023 (09:42 IST)
తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జరుగనున్నాయి. రాజమండ్రి వేదికగా నిర్వహించే ఈ మహానాడుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ మహానాడుకు ఏకంగా లక్ష మంది, బహిరంగ సభకు 15 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడుకు వచ్చే వారికి విందు భోజనం కూడా వడ్డించనున్నారు. ఇందుకోసం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి గాంచిన వంటకాలను వడ్డించేలా చర్యలు చేపట్టారు. 
 
రాజమండ్రిలోని వేమగిరి వద్ద ఈ మహానాడు జరుగనుంది. ఈ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల సుబ్బరాజు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 
 
ఈ మహానాడు ఏర్పాట్లపై వారు స్పందిస్తూ, మహానాడు తొలి రోజు ప్రతినిధులు సమావేశానికి లక్ష మంది వస్తారని తెలిపారు. ఆ తర్వాత రోజు జరిగే బహిరంగ సభకు దాదాపు 15 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. వీరందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విందులో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన అన్ని రకాల వంటకాలు వడ్డించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు