జూలై 1 నాటికి ఉద్యోగుల వారికి కొత్త జీతాలు: సీఎం జగన్

బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (17:18 IST)
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. 
 
జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు మంచి జరగాలనే వారి సర్వీసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచామని సీఎం జగన్ వెల్లడించారు. 
 
జూన్ 30లోగా కారుణ్య నియామకాలు జరపాలన్నారు. యుద్ధప్రాతిపదికన కారుణ్య నియామకాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. 
 
జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌లో రిబేటుపై స్థలాలు కేటాయించామని, 10 శాతం స్థలాలను 20 శాతం రిబేటుపై కేటాయించామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు