ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ఆగస్టు 3 నాటి తన జన్మదినాన్ని ఈ సంవత్సరం కూడా జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితి కారణంగా మాననీయ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవ్వరూ రాజ్ భవన్కు రావద్దని బిశ్వ భూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు.
కరోనా ప్రమాదాన్ని తగ్గించడంలో, వైరస్ నుండి రక్షణ కల్పించడంలో టీకా సహాయపడగలదని, అర్హులైన వారందరూ వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనం రెండవ తరంగంలో ఉండగా, కొత్త వేరియంట్ల ఆవిర్భావం కారణంగా మూడవ తరంగం సంభవించడంపై ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారని గవర్నర్ గుర్తు చేశారు.
ఈ పరిస్థితుల్లో ముసుగు ధరించడం, సామాజిక దూరం పాటించడం, కోవిడ్ ప్రవర్తనా నియమావళిని అనుసరించడం తప్పనిసరన్నారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవటం కోవిడ్ -19 వ్యాప్తిని నిరోధిస్తుందని గవర్నర్ వివరించారు.