విజయవాడ - బెంగుళూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి

ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (12:01 IST)
విజయవాడ - బెంగుళూరు ప్రాంతాల మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రోడ్డు మార్గం విజయవాడ, బెంగుళూరు నగరాలను కలుపుతూ శ్రీ సత్యసాయి జిల్లా మీదుగా నిర్మించనున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రహదారిపై వెళ్లే వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రోడ్డును నిర్మించనున్నారు. 
 
అంతేకాకుండా సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్ల ముప్పవరం వరకు నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిగా నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. 
 
సత్యసాయి జిల్లాలో 2 వేల ఎకరాల భూముల సేకరణకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వ, అటవీ, పట్టా భూముల వారిగా అధికారులు వివరాలు సేకరిస్తారు. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ప్రకారం ఏయే రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుందనే వివరాలతో నోటిఫికేషన్‌ త్వరలోనే ఇవ్వనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు