గుంటూరు జిల్లా అమరావతి టౌన్‍షిప్‌లో ఓ ముళ్లపొదల్లో హత్యకు గురైన జ్యోతి కేసులోని మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. ఆమెపై అత్యాచారం జరగలేదనీ, కానీ పక్కా ప్రణాళికతో హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పైగా, ఈ కేసులో ప్రధాన ముద్దాయి శ్రీనివాస్‌దేనని చెప్పారు.
కాగా, గతవారం ప్రియుడు శ్రీనివాస్‌తో కలిసి జ్యోతి బైక్‌పై అమరావతి టౌన్ షిప్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడు ఇద్దరు ఉన్న సమయంలో జ్యోతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రియుడిని కొట్టి... జ్యోతిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ కేసులో ఇప్పటివరకు శ్రీనివాస్ స్నేహితులు శశి, పవన్ అనే ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిద్దరూ హత్యకు వారం రోజుల ముందు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తుంది. అమరావతి టౌన్‌షిప్ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం.. అక్కడ జనసంచారం పెద్దగా లేకపోవడంతో జ్యోతిని అక్కడకు తీసుకురావాలని శ్రీనివాస్‌కు వీరే చెప్పారని పోలీసులు భావిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతోనే జ్యోతిని వదిలించుకునేందుకు శ్రీనివాసే హత్యకు ప్లాన్ వేశాడని పోలీసులు చెబుతున్నారు.