సెల్‌ఫోన్లలో నీలి చిత్రాలు చూడడం, హార్మోన్ల ప్రభావంతో రాత్రిపూట పక్కపక్కనే పడుకునేటప్పుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇలాంటి గురుకులాల్లో చదువుతున్న పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు, లేదా తల్లిదండ్రులే పాఠశాలలను సందర్శించినప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్న పిల్లలు వారి తల్లిదండ్రులతో వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులో వచ్చింది. వీటిపై ఫిర్యాదులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.